యాంకర్ శ్రీముఖి సినిమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసా?
Tv Anchor Srimukhi : అనసూయ తదితరుల మాదిరిగా స్టార్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీ ముఖి కూడా బుల్లితెరకు, వెండితెరకు ప్రాధాన్యత ఇస్తూ తన సత్తా చాటుతోంది. సూపర్ సింగర్ 9, అదుర్స్ రియాలిటీ షోలకు శ్రీముఖి యాంకర్ గా చేసింది. అయితే ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమైనన్ పటాస్ షో శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచింది. రవితో కలిసి పటాస్ షో చేసిన శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ రావడంతో పటాస్ షోకు గుడ్ బై కొట్టేసింది.
బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడడంతో షో విన్నర్ గా శ్రీముఖి అవుతుందని చాలామంది అనుకున్నారు. ఆమె రన్నర్ గా నిల్చింది. రన్నర్ అయినప్పటికీ ఆమె ఆ షోకు రెమ్యునరేషన్ బాగానే అందుకుందని టాక్. బిగ్ బాస్ షో తర్వాత కొన్ని నెలల పాటు సైలెంట్ గా ఉన్నప్పటికీ మళ్లీ వరుస షోలతో బిజీగా మారింది.
అయితే జులాయి మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఆఫర్లు వరుసగా వచ్చాయి. నేను శైలజ సినిమాలో రామ్ చెల్లెలి పాత్రలో నటించింది. ఆ పాత్రలో శ్రీముఖి అద్భుత నటన ప్రదర్శించింది. ప్రేమ ఇష్క్ కాదల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మరికొన్ని సినిమాల్లో నటించి శ్రీముఖి సత్తా చాటగా, కొత్తగా నటించిన క్రేజీ అంకుల్స్ మూవీ త్వరలో రిలీజ్ కావాల్సి ఉంది.