ఈ 5 సినిమాలు చేసి ఉంటే స్టార్ హీరో అయ్యేవాడా…మిస్ అయ్యాడు
Sumanth Movies :సుమంత్ అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా నాగార్జున మేనల్లుడిగా 1999 వ సంవత్సరంలో రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో ‘ప్రేమకథ’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు ఏమి రాలేదు. 2003 లో జెనీలియాతో నటించిన సత్యంతో చిత్రసీమలో కాస్త నిలదొక్కుకున్నాడని అనిపించింది.
అయితే సరైన కథలను ఎంచుకోవడంలో తప్పటడుగు వేయటం వలన మరో హిట్ కోసం దాదాపుగా మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది.అయితే సుమంత్ కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
తొలిప్రేమ
సుమంత్ తొలిప్రేమ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఆ సినిమాను మిస్ చేసుకొని ప్రేమకథ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ నటించి ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనకు తెలిసిన విషయమే.
నువ్వే కావాలి
తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నువ్వే కావాలి మొదటగా సుమంత్ దగ్గరకే వచ్చింది. అయితే అనుభవ రాహిత్యంతో కథ తనకు నప్పదేమో అని సంశయంతో నో చెప్పేసాడు.
ఇడియట్
రవితేజకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. పూరి జగన్నాథ్ మొదట ఈ కథను సుమంత్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అయితే సుమంత్ నో చెప్పటంతో మాస్ మహారాజ్ రవితేజ దగ్గరకి వెళ్ళింది. ఒకరకంగా రవితేజ హీరోగా నిలదొక్కుకోవడానికి బాగా హెల్ప్ చేసింది.
మనసంతా నువ్వే
ఈ సినిమా కథను మొదట సుమంత్ కి దర్శకుడు ఆదిత్య చెప్పాడు. కానీ సుమంత్ నో అని చెప్పటంతో ఉదయ్ కిరణ్ దగ్గరకు వెళ్లి చెప్పితే వెంటనే ఒకే చెప్పేసాడు. ఆ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో
నువ్వొస్తావని
డైరెక్టర్ ప్రతాప్ మొదట ఈ కథను సుమంత్ కి చెప్పగా సుమంత్ నో చెప్పి నాగార్జున దగ్గరకు పంపాడు. నాగార్జున కథ విన్న వెంటనే ఒకే చెప్పేసాడు. ఈ సినిమా నాగార్జున సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.