అలనాటి ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా….ఇప్పుడు ఏమి చేస్తుందో…!?
Telugu Actress Archana :ప్రస్తుతం సినిమా పరిశ్రమ అంటే గ్లామర్ ప్రపంచం అనుకునేలా మారిపోయింది. అయితే గ్లామర్ లేకున్నా టాలెంట్ తో రాణించిన నటీమణులు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో ప్రధానంగా నటి అర్చన గురించి ప్రస్తావిస్తే, హీరోల పక్కన డాన్స్ ల కోసం వెంపర్లాడకుండా తన ఇమేజ్ కి తగ్గ పాత్రలు చేసి నెగ్గుకొచ్చింది. ఈమె 1980దశకంలో బాగా రాణించిన నటి. తెలుగు,తమిళం,మలయాళం తదితర భాషల్లో నటించింది.
కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మధుర గీతం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మధుర గీతంలో నటించినప్పటికీ నిరీక్షణ మూవీ అర్చనకు మంచి బ్రేక్ ఇచ్చింది. కోరుకున్నవాడి కోసం ఏళ్లతరబడి ఎదురుచూసే గిరిజన యువతి పాత్రలో ఈమె నటనకు జనం జేజేలు పలికారు. బాలు మహేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో భానుచందర్ హీరోగా చేసాడు. తర్వాత రాజేంద్రప్రసాద్ తో అర్చన నటించిన లేడీస్ టైలర్ మంచి హిట్ అయింది. అలాగే సుమన్ తో వచ్చిన ఉక్కు సంకెళ్లు మూవీలో కూడా తన నటనతో రాణించింది.
స్వతహాగా డాన్సర్ అయిన అర్చన డాన్స్ బ్యాక్ డ్రాప్ గల సినిమా చేయాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక 1988లో వచ్చిన దాసీ మూవీ లైఫ్ టైం గుర్తుండేలా చేసింది. బి నరసింగరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ద్వారా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం గెలుచుకుంది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన భారత్ బంద్ మూవీ కూడా అర్చనకు బ్రేక్ ఇచ్చింది. అందం లేకున్నా అభినయంతో ఆకట్టుకున్న అర్చన సెకండ్ ఇన్నింగ్స్ చేస్తుందా లేదా అనేది చూడాలి.