సీరియల్స్ లో ద్విపాత్రాభినయం చేస్తున్ననటీమణులు ఎంత మందో…?
Tv Serials In telugu :సినిమాల్లో డ్యూయెల్ రోల్స్ వేసిన నటీనటులు,హీరో హీరోయిన్స్ ని చూసాం. మూడేసి పాత్రలు వేసిన నటులున్నారు.అయితే టెలివిజన్ రంగంలో సీరియల్స్ కి పెద్దపీట వేస్తున్నారు. ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు.దీంతో డ్యూయెల్ రోల్స్ కూడా వేస్తున్నారు. అలా బుల్లితెరపై ద్విపాత్రాభినయం చేసిన హీరోయిన్స్ గురించి చూస్తే, చాలావరకూ హిట్ అయ్యాయి. 2013లో జెమిని టివిలో వాణి-రాణి మొదలై మెగా సీరియల్ గా సాగింది. ఇందులో ఒకప్పటి సినీ స్టార్ హీరోయిన్ రాధిక ద్విపాత్రాభినయం చేసింది.
అలాగే జెమినిlo ప్రస్తుతం ప్రసారమవుతున్న అక్కమొగుడు సీరియల్ లో సౌమ్య, రమ్య గా హీరోయిన్ ఐశ్వర్య గౌడ రెండు పాత్రలను పోషిస్తూ మెప్పిస్తోంది. 2018నుంచి ఈ సీరియల్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇక కల్యాణవైభోగం సీరియల్ జి తెలుగులో సూపర్ హిట్ సీరియల్ గా రన్ అవుతూ ప్రజాదరణ పొందుతోంది. ఇందులో మంగ, నిత్య, దివ్యగా మూడు పాత్రల్లో హీరోయిన్ మేఘన లోకేష్ త్రిపాత్రాభినయం చేస్తోంది. ప్రస్తుతం జెమినిలో ప్రసారమవుతున్న గిరిజా కళ్యాణం సీరియల్ లో గిరిజ,వర్ణ గా ద్విపాత్రాభినయంతో హీరోయిన్ సుహాసిని అలరిస్తోంది.
స్టార్ మాలో వస్తున్న దేవత సీరియల్ లో రుక్మిణి చెల్లెలు సత్యగా, వైష్ణవి రెడ్డి నటిస్తూ, సత్యకు తల్లిగా కూడా నటిస్తోంది. 2009జనవరి లో ప్రారంభమైన ఆడదే ఆధారం సీరియల్ 2020వరకూ విజయవంతంగా నడిచింది. ఇందులో అలేఖ్య, అమూల్య, అర్పిత గా త్రిపాత్రాభినయం చేసిన హీరోయిన్ పల్లవి రామశెట్టి ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. 2019ఏప్రియల్ 12నుంచి జి తెలుగులో అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ నడుస్తోంది. ఈ సీరియల్ లో హీరోయిన్ చైత్రారాయ్ అక్కగా, చెల్లిగా భరణి, శ్రావణి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తూ అలరిస్తోంది. ఇప్పటికీ ఈ సీరియల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.