చిడతల అప్పారావు గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
Chidatala Apparao Details :ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించి, 50ఏళ్లపాటు వందల చిత్రాల్లో నటించి 2దశాబ్దాల క్రితం పరమపదించిన కమెడియన్ చిడతల అప్పారావు రాజమండ్రిలోనే పుట్టినప్పటికీ నటన రంగంపై ఆసక్తితో మద్రాసు వెళ్లారు. ఒకప్పటి స్టార్ కమెడియన్ రాజబాబు, నిర్మాత జయకృష్ణ కూడా చిడతల అప్పారావు తో కల్సి మద్రాసు వెళ్లారు. అయితే రాజబాబు తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ అయ్యారు. 1951లో పెంకి పెళ్ళాం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చిడతల అప్పారావు చిన్న చిన్న పాత్రలకే పరిమితమై పోయారు.
రెమ్యునరేషన్ ఎవరు ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవారు చిడతల అప్పారావు. ఇవ్వకపోయినా అడిగేవారు కాదు. అయితే రోజులు గడవాలంటే ఆదాయం ఉండాలన్న ఉద్దేశ్యంతో మేకప్, డ్రెస్సింగ్ విభాగాల్లో పని కుదుర్చుకున్నారు. కమెడియన్ గా తనకు సూటయ్యే పాత్రల్లో రాణించారు. ఆలీబాబా అరడజను దొంగల్లో ఒక దొంగగా ఆకట్టుకున్నారు. అల్లరి అల్లుడు ,ముద్దుల ప్రియుడు,లారీ డ్రైవర్,ఆ ఒక్కటి అడక్కు, బృందావనం, కొండవీటి సింహం, వేటగాడు, సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలియుద్ధం, వంటి మూవీస్ లో చిడతల అప్పారావు నటించారు. దానగుణం గల ఈయన జూనియర్ ఆర్టిస్టులు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే జేబులోంచి ఎంతోకొంత తీసి ఇచ్చేవారు.
బంధువుల పెళ్లిళ్లు,ఇల్లు కట్టుకోవడంలో ఈయన సాయం చేసేవారు. అభిమానులు ఇంటికి వస్తే, తృప్తిగా భోజనం పెట్టి,వారితో ఫోటోలు దిగి పంపించేవారు. కే. రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, జంధ్యాల,ఈవీవీ సత్యనారాయణ, ఇలా పలువురు దర్శకులు ఈయనకు ఛాన్స్ లు ఇచ్చేవారు. మొదటి భార్య చనిపోవడంతో మళ్ళీ దుర్గ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. కూతురు కృష్ణవేణి, కుమారుడు నవీన్ కుమార్ ఉన్నారు. అయితే కాన్సర్ బారిన పడిన చిడతల అప్పారావు కి ఎంతోమంది సాయం చేసారు. ఆ వ్యాధి బారినపడి చిక్కిపోవడం, పలువుర్ని కలచి వేసింది. చివరకు ఇండస్ట్రీని,ఈలోకాన్ని వీడి వెళ్లిపోయారు.