పండ్లు కూరగాయలను శానిటైజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా ?
Fruits and vegetables sanitize :కరోనా కారణంగా మనం చాలా విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. బయటి నుంచి ఏ వస్తువు ఇంటికి తీసుకొచ్చిన ఒకటికి రెండుసార్లు కడిగి శానిటైజ్ చేస్తున్నాము. ఈ నేపథ్యంలో చాలామంది కూరగాయలను పండ్లను కూడా శానిటైజర్ చేస్తున్నారు అయితే ఈ విధంగా శానిటైజ్ చేయటం వల్ల….శానిటైజ్ లో ఉండే ఆల్కహాల్ పండ్లు కూరగాయల్లోని పోషకాలను నశింపజేస్తుందని…అందువల్ల శానిటైజ్ చేయకుండా ఇప్పుడు చెప్పే పద్ధతి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
కూరగాయలను పండ్లను ఉప్పు నీటిలో కడిగి తుడుచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మనలో చాలామంది పండ్లను కూరగాయలను డిటర్జెంట్ కలిపిన నీళ్ళతో అడుగుతున్నారు. అలా కడగటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు