కార్తీకదీపం సీరియల్ వంటలక్క ఇమేజ్ కి అసలు కారణం ఇదే
karthika deepam serial today episode :ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సినిమా రంగమే కాదు,బుల్లితెర రంగం కూడా వచ్చేసింది. వెండితెరకు మించిన డిమాండ్ బుల్లితెర మీద ఉంటోంది. అందుకే సినిమా రంగంలో అంతగా నిలబడలేనివాళ్ళు బుల్లితెరపై రాణిస్తున్నారు. అందులో డైరెక్టర్ రాజేంద్ర కాపుగంటి ఒకరు. ఈయన డైరెక్షన్ లో ‘రాంబాబు గాడి పెళ్ళాం’,’శివశంకర్’మూవీస్ వచ్చినా అవి ఆకట్టుకోలేదు.దాంతో బుల్లితెర సీరియల్స్ వైపు అడుగులు వేసారు.
అందం,బంగారుబొమ్మ సీరియల్ గతంలో తీసిన రాజేంద్ర కాపుగంటి ఆతర్వాత కార్తీకదీపం స్టార్ట్ చేసాడు. ఊహించిన మలుపులతో ఈ సీరియల్ విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే ఇన్నాళ్లు ఈయన బయటకు పెద్దగా కనిపించలేదు. తాజాగా ఈ సీరియల్ లో వంటలక్క పాత్రతో ఎక్కడ లేని ఇమేజ్ తెచ్చుకున్న ప్రేమీ విశ్వనాధ్ తో కల్పి దిగిన ఫోటో వైరల్ కావడంతో ఈయన గురించి తెల్సింది.
అయితే ఈ ఫోటో చూసి పాజిటివ్ గా కామెంట్స్ పెట్టేవాళ్ళతో పాటు నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఎక్కువే ఉంటున్నారు. కార్తీక దీపం సీరియల్ తీసేది నువ్వేనా సామీ అంటూ కొందరు నెటిజన్స్ ఆడిపోసుకుంటున్నారు. మోనిత గర్భవతి అయితే రేటింగ్స్ పడిపోతాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ సీరియల్ తో వంటలక్క ప్రేమీ విశ్వనాధ్ కి ఎక్కడలేని ఫాన్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసింది.