భజరంగీ భాయిజాన్ మూవీ చిన్నారి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Bajrangi bharijaan Child Artist :దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి అతడి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించే కథలే కీలకం. అయితే బయట సినిమాలకు కూడా ఈయన కథలు అందిస్తారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన భజరంగీ భాయిజాన్ మూవీకి కథ విజయేంద్ర ప్రసాద్ అందించారు. సల్మాన్ ఖాన్ హీరోగా 2015లో ఈ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో నటించిన ముద్దులొలికే చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా నటించింది.
ఐదేళ్ల వయస్సులో తన నటనతో ఆకట్టుకున్న మల్హోత్రా ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడామె వయస్సు 13ఏళ్ళు. పుట్టినరోజు వేడుక సందర్బంగా ఫోటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ తాను ఇప్పుడు యవ్వనంలో ఉన్నట్లు కూడా పేర్కొంది. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
అప్పుడే ఎంత ఎదిగిపోయిందో అంటూ అవాక్కవుతున్నారు. భజరంగీ భాయిజాన్ లో వేసిన అమ్మాయేనా అని ప్రశ్నించుకుంటున్నారు. చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందొ ఇప్పుడు కూడా అలానే ఉందని, కానీ చాలా మారిపోయిందని నెటిజన్స్ పేర్కొంటు న్నారు.హర్షాలీ మల్హోత్రాకు సోషల్ మీడియాలో 10లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తనకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన వారికి ఆమె కృతజ్ఞతలు కూడా చెప్పింది.