సీరియల్ స్టార్ విష్ణుప్రియ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…!?
Telugu Tv Serial Actress Vishnu Priya :సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించి ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకున్న నటి విష్ణుప్రియ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ లో శ్రీనివాస్, లక్ష్మి దంపతులకు ఆగస్టు 19న జన్మించింది. ఈమెను ప్రియా, హాసిని అని పిలుస్తారు. ఈమెకు రాజేష్ అనే ఒక బ్రదర్ ఉన్నాడు. 2016ఫిబ్రవరి 16న సిద్ధార్ధ్ వర్మను ప్రేమించి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంది. వీరికి Ayaansh Varma అనే కొడుకు ఉన్నాడు.
నటన మీద ఇష్టం లేకున్నా సరే, స్కూల్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో విష్ణుప్రియ పాల్గొనేది. డిగ్రీ చదువుతుండగానే తమిళంలో ఓ షార్ట్ ఫిలిం లో ఛాన్స్ వచ్చింది. మొదట్లో వద్దనుకున్నా పేరెంట్ ఇంట్రెస్ట్ మేరకు చెన్నై వెళ్లి యాక్ట్ చేసింది. అలా ఇండస్ట్రీకి వచ్చిన ఈమె ఈరోజుల్లో అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమకథా చిత్రం,బలుపు,మిస్టర్ పెళ్ళికొడుకు,పండగ చేస్కో,పిల్లా నువ్వులేని జీవితం,రామయ్య వస్తావయ్యా, రభస వంటి మూవీస్ లో నటించింది.
అదే సమయంలో సీరియల్స్ లో నటించే ఛాన్స్ రావడంతో అభిషేకం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ కుంకుమ పువ్వు, ఇద్దరమ్మాయిలు,నువ్వే కావాలి వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం zee తెలుగులో త్రినయని సీరియల్ లో నటిస్తోంది. ఈమెకు హీరోల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఊటీ అంటే ఇష్టమైన ప్రదేశం. సొంత కార్లు, సొంత నివాసం గా అపార్ట్ మెంట్ ఉన్నాయి. బుక్స్ చదవడం, ట్రావెలింగ్, షాపింగ్ ఈమె హాబీస్.