ఫేమస్ టీవి సీరియల్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా…వెంటనే చూసేయండి
karthika deepam director kapuganti rajendra :రోజుకో ట్విస్ట్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్న కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై హయ్యస్ట్ టిఆర్పి గల సీరియల్ గా గుర్తింపు పొందింది. ఈ సీరియల్ లో వంటలక్క పాత్రతో ప్రేమీ విశ్వనాధ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా వంటలక్కతో కల్సి డైరెక్టర్ దిగిన ఫోటో తెగ వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసి నెటిజన్స్ ఎవరి రేంజ్ లో వాళ్ళు కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే రెండున్నరేళ్లుగా ఈ సీరియల్ లో ముఖ్యమైన పాత్రల మధ్య గొడవలతో ట్విస్టులతో డైరెక్టర్ నడిపిస్తున్నాడు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కి ఎడిట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో తాజా ఫోటో చూసి వంటలక్క, డాక్టర్ బాబు లను కలిపేయొచ్చు కదా అంటూ కొందరు కామెంట్స్ పెడితే,ఇంకా సాగదీత ఎందుకని మరికొందరు అంటున్నారు. అయితే దర్శకుడు రాజేంద్ర కాపుగంటి గతంలో అందం, బంగారు బొమ్మ సీరియల్స్ చేసాడు. అంతేకాదు, కొన్ని సినిమాలను డైరెక్ట్ చేసాడు. అయితే కార్తీక దీపం సీరియల్ తో ఎక్కడలేని ఇమేజ్ తెచ్చుకున్నాడు.