MoviesTollywood news in telugu

జూనియర్ ఎన్టీఆర్ అశోక్ మూవీ వైఫల్యానికి కారణాలు ఇవే…!?

Ashok Movie Failure Reasons :నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సురేంద్రరెడ్డి రెండవ సినిమాగా అశోక్ మూవీ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భారీ సాంకేతిక విలువలతో,భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా వైఫల్యాన్ని మూటగట్టుకుంది. సింహాద్రి తర్వాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో అశోక్ హిట్ ఇస్తుందని ఆశించారు.

భారీ అంచనాల నడుమ బిజినెస్ కూడా బాగానే జరిగింది. సింపుల్ కథని స్టైలిష్ గా డైరెక్టర్ తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ఇంటర్ డక్షన్ సీన్ తారక్ కెరీర్ లోనే బెస్ట్ గా చెప్పొచ్చు. విలన్ సోనూ సూద్ ఎంట్రీ కూడా స్టైలిష్ గా ఉంటుంది. 12కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 2006 జులై 18న థియేటర్లలోకి వచ్చింది. తారక్,ప్రకాష్ రాజ్ యాక్షన్,రాజీవ్ కనకాల డెత్ సీన్,విలన్ తల్లికి తారక్ హెచ్చరిక ..ఇలా సినిమాలో అన్నీ సీన్స్, మణిశర్మ సాంగ్స్ ఆకట్టుకుంటాయి.

మొదటివారం 11కోట్ల షేర్ కలెక్ట్ చేసిన అశోక్ మూవీ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. 16కోట్ల కలెక్షన్ తో ఏవరేజ్ గా మిగిలింది. క్లైమాక్స్ నార్మల్ గా ఉండడం, ముఖ్యంగా చివరి 20నిముషాలు దెబ్బకొట్టింది. కామెడీ మిస్సయింది. ఎంటర్టైన్ మెంట్ మిస్ కావడంతో సీరియస్ నెస్ గా మూవీ నడవడం జనానికి ఎక్కలేదు. ఇక మహేష్ బాబు పోకిరి మూవీ ప్రభంజనం ఉండడం,విక్రమార్కుడు హిట్,బొమ్మరిల్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని అక్కట్టుకోవడం అశోక్ కి ఎఫెక్ట్ అయింది. ఎన్టీఆర్ బొద్దుగా ఉండడంతో పాటు హీరోయిన్ మైనస్ గా ఉన్నట్లు రివ్యూస్ లో వచ్చింది.