MoviesTollywood news in telugu

అసలే కరోనా…. ఆపై హీరోల రెమ్యునరేషన్ పెంపు…ఎంతో తెలుసా?

Tollywood star heroes huge remunerations :గత ఏడాది మార్చి చివరి వారం నుంచి కరోనా ఎఫెక్ట్ తో సినిమా పరిశ్రమ పడుకుంది. షూటింగ్స్ లేక,థియేటర్లు మూతబడి నానా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. గత డిసెంబర్ నుంచి థియేటర్లు తెరవడం,కొన్ని సినిమాలు రిలీజవ్వడం,మళ్ళీ సెకండ్ వేవ్ తో ఏప్రియల్ చివరి వారం నుంచి మూతపడ్డ థియేటర్లు మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీదు. ఇంకోపక్క థర్డ్ వేవ్ భయం కూడా వెంటాడుతోంది. దీంతో నిర్మాతలు నరకం చూస్తున్నారు .

కొన్ని సినిమాలు షూటింగ్స్ అయినా రిలీజ్ కి నోచుకోక,మరికొన్ని సినిమాల షూటింగ్స్ పూర్తికాక ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు పుండుమీద కారం చల్లినట్లు కొందరు హీరోలు రెమ్యునరేషన్ పెంచేసారట. గతంలో లాభాల్లో వాటా తీసుకున్నట్లు చెప్పబడే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రూ 50కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ ఒన్ కి తక్కువ మొత్తమే తీసుకున్నా, పార్ట్ టుకి రూ 50కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు 35కోట్లు చొప్పున అందుకున్నట్లు, ఇది హిట్ అయితే పెంచడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే నిర్మాణం అవుతున్నాయి. అందుకే ఒక్కో సినిమాకు రూ 50కోట్ల వరకూ అందుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలు హిట్ అయితే ఇంకా పెంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోపక్క సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక గత మార్చిలో వకీల్ సాబ్ రిలీజ్ తో బంపర్ కలెక్షన్స్ రాబట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం రూ 50కోట్లతో పాటు లాభాల్లో రూ 15కోట్లు అందుకున్నట్లు టాక్.