Mustard seeds:ఆవాలే కదా అనుకుంటే పొరపాటు… ఎన్నిలాభాలో తెలిస్తే…అసలు నమ్మలేరు
Mustard seeds health Benefits in telugu :ప్రతి ఇంటిలో వంట గదిలో పోపుల పెట్టెలో ఆవాలు కచ్చితంగా ఉంటాయి. ఏ కూర చేసినా ఆవాలు తప్పనిసరిగా వాడతారు. చాలా చిన్నగా ఉండే అవాలులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది ఉప్మా వంటి వాటిలో ఆవాలను ఏరి పాడేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఆవాలులో ఉన్న ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే అసలు వదలకుండా తింటారు. ఆవాలు పొడి చేసుకుని దానిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి. ఈ సమయంలో దగ్గు, జలుబు అనేవి వచ్చేస్తూ ఉంటాయి.అధిక బరువు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఆవాల పొడి కలిపి తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మలబద్దకానికి చెక్ పెడుతుంది. ఆవాలులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆవాలును తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు చేసుకునే కూరల్లో కచ్చితంగా ఆవాలును ఉపయోగించండి. అప్పుడు ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.