MoviesTollywood news in telugu

ప్రభాస్ కి ఎన్ని వేల కోట్ల అస్థి ఉందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood Hero Prabhas properties :ఇప్పుడు హీరో హీరోయిన్స్ సినిమాల్లో సంపాదించింది వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ బాగానే గడిస్తున్నారు. రెండు చేతులా సంపాదిస్తూ, అపర కుబేరులవుతున్నారు. ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో,థియేటర్స్ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టి దాదాపు 13 మిలియ‌న్ డాలర్లు సంపాదించినట్లు టాక్.

ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ఓ వెలుగు వెలిగి,సొంతంగా వ్యాపారాలు కూడా చేసారు. ఇక రాజకీయాలలో చేరి,కేంద్ర మంత్రి కూడా అయ్యారు. తమ్ముడు కొడుకు అయిన ప్రభాస్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసారు. మొదట్లో పెద్దగా హిట్స్ లేని ప్రభాస్ వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఛత్రపతి,మిర్చి వంటి మూవీస్ తో యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక బాహుబలితో ఎవరెస్టు శిఖరం ఎత్తుకి ఎదిగాడు.

ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న యువి క్రియేషన్స్ లో కూడా ప్రభాస్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు టాక్. సాహో మూవీతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నడపడం,భారీ స్క్రీన్స్ ఏర్పాటుచేయడం స్టార్ట్ చేశారట. ఇక ఒక్కో సినిమాకు రూ 50కోట్లు వరకూ అందుకుంటున్నాడు.దాంతో బాగానే వెనకేసినట్లు,నెట్ వర్త్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.