దగ్గుబాటి రానా లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి ఉందో…?
Tollywood Hero Rana : మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడుగా,నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు,లక్ష్మి దంపతుల తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా ఓపక్క హీరో పాత్రలతో మెప్పిస్తూ,మరోపక్క నెగెటివ్ షేడ్ పాత్రలలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం విరాటపర్వం మూవీతో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు.
2010లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా బాహుబలి మూవీలో భల్లాల దేవుడిగా విలన్ రోల్ వేసి తన నటనతో ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఇతడి పూర్తి పేరు రామానాయుడు దగ్గుబాటి.యితడు 1984డిసెంబర్ 14న చెన్నైలో జన్మించాడు. ఇప్పుడు 37ఏళ్ళు నిండు తాయి. ఇతడిని రానా,నాయుడు అనే పేర్లతో పిలుస్తారు. రానాకి మాళవిక అనే ఓ సిస్టర్,అభిరాం అనే ఓ బ్రదర్ ఉన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అలాగే ఏసీ ఎం ఈ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చదువుకున్న రానా ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ పూర్తిచేసాడు. గత ఆగస్టు 8న మిహికా బజాజ్ అనే అమ్మాయితో పెద్దల ఆశీర్వాదంతో రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా పెళ్లయింది.స్కూల్ డేస్ లో రామ్ చరణ్, శర్వానంద్, అల్లు శిరీష్ ల క్లాస్ మేట్ అయిన రానా సినిమాల్లో చేయాలని భావించి, 9వ తరగతిలోనే ఉడ్ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ నేర్చుకున్నాడు. ఇంటర్ చదివే రోజుల్లోనే సినిమాలకు గ్రాఫిక్స్ డిజైన్ చేసేవాడు. హీరోగా చేయాలనుకుని లీడర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీకి 1.8కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు.
హిందీలో దమ్ ఆర్ దమ్ మూవీలో కూడా నటించాడు. తమిళంలో అజిత్ కుమార్ తో కల్సి ఆరంభం మూవీలో నటించాడు. కేరాఫ్ కంచరపాలెం కి ప్రొడ్యూసర్ గా చేసాడు. 2011లో నేను నా రాక్షసి, 2012లో కృష్ణం వందే జగద్గురుమ్, 2015లో బాహుబలి, 2017లో నేనే రాజు నేనే మంత్రి, హిందీలో ఘాజి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో చేసాడు.
ఇక ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహబలి మూవీలో నటించి 10 కోట్లు కంటే ఎక్కువే రెమ్యునరేషన్ అందుకున్నాడు. చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడే రానాకు లండన్ అంటే ఇష్టం. 6అడుగులు 2అంగుళాల ఎత్తుగల యితడికి అక్షయ కుమార్,కమల్ హాసన్,కత్రినా కైఫ్ అంటే ఇష్టం. నెట్ వర్త్ 50కోట్లు ఉంటుంది. హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఖరీదైన ఇల్లు,రెండు విలాసవంతమైన కార్లు ఉన్నాయి.