ఊహలు గుసగుసలాడే సీరియల్ వసుంధర రియల్ లైఫ్…భర్త ఎవరో తెలుసా?
Oohalu gusagusalade serial :ఛానల్స్ లో ధారావాహికంగా సీరియల్స్ ప్రసారమవుతూ,కొన్ని పూర్తయ్యాక మరికొన్ని మొదలవుతున్నాయి.ఆ విధంగా ఇటీవల ఊహలు గుసగుసలాడే సీరియల్ జి తెలుగులో మొదలైంది. సీరియల్ కథ బాగుండడంతో ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. అలాగే ఇందులో నటీనటులు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు.
చిన్నకోడలు,గీతాంజలి వంటి సీరియల్స్ లో నటించి, తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకున్న రూపా ఊహలు గుసగుసలాడే సీరియల్ లో వసుంధర పాత్రలో నటిస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో రూపా జన్మించింది. అక్కడే స్టడీస్ పూర్తిచేసింది. కన్నడ టివి రంగంలో అడుగుపెట్టి తన కేరీర్ మొదలు పెట్టిన ఈమె తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె భర్త పేరు శ్రవణ్. వీరికొక పాప ఉంది.
జీతెలుగులో వచ్చిన చిన్న కోడలు సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రూపా అందులో రాధికగా అమాయకపు పాత్రలో ఒదిగిపోయి,ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. గీతాంజలి సీరియల్ లో డ్యూయెల్ పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది. పెళ్లి తర్వాత ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి, ఇంటిగుట్టు సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడే సీరియల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.