శాకుంతలంలో భరతుడి పాత్ర…స్టార్ హీరో కొడుకు…ఎవరో..!?
shakuntalam Movie :ఒక్కడు, రుద్రమదేవి వంటి మూవీస్ తీసిన క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో శకుంతలాగా అక్కినేని వారి కోడలు సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో కీలకమైన భరతుడు పాత్రకోసం చైల్డ్ ఆర్టిస్ట్ వేటలో పడ్డారు. ఇప్పుడు శాకుంతలం మూవీలో భరతుడి పాత్రకోసం ఇద్దరు అగ్ర స్టార్ హీరోల కొడుకుల పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్త వైరల్ గా మారింది.
ఒకప్పుడు బాలల రామాయణం కూడా తీసిన గుణశేఖర్ ఆ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీద చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా చూపించాడు. అయితే ఇప్పుడు శాకుంతలంలో జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభిరాంను భరతుడిగా చేయించాలని గుణశేఖర్ భావిస్తున్నాడట. బాలల రామాయణంలో గుణశేఖర్ చేసిన పరిచయం కల్సి రావడంతో తారక్ ఇప్పుడు తన కొడుకు విషయంలో ఒకే చెబుతాడని టాక్.
ఒకవేళ కుదరని పక్షంలో అల్లు అర్జున్ తనయుడు అయాన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్. ఇక కీలకమైన దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు శాంత నటించనున్నట్లు ఇప్పటికే ఖరారైంది. శాకుంతల,దుష్యంతుడి ప్రేమకు చిహ్నంగా పుట్టిన బిడ్డకు భరతుడిగా నామకరణం చేసారు. మరి ఈ కీలకమైన భరతుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎవరు నటిస్తారో చూడాలి.