ఇలియానా సినిమాలకు దూరం కావడానికి ఈ తప్పులే కారణమా?
Tollywood Heroine ileana :టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా తక్కువ సమయంలోనే అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబుతో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఇలియానా రవితేజాతో కిక్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ భామకు పొగరెక్కువ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.
చివరకు ఇలియానా చేసిన పొరపాటే ఆమె కెరీర్ ని దెబ్బతీసిందన్న టాక్ ఇండస్ట్రీలో విన్పిస్తోంది. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ తో ఈమె గొడవ పడినట్లు కూడా చెబుతుంటారు. అయితే తెలుగులో ఒక దర్శకుడితో గొడవ జరగడం, సినిమాలో చాలా ఇబ్బంది పెట్టడంతో ఆ సినిమా బాగున్నప్పటికీ అందులో ఈమె క్యారెక్టర్ అస్సలు బాగాలేదని కూడా టాక్.
దీంతో తనను కావాలనే డైరెక్టర్ అలా చేసాడని ఇలియానా ఆరోపణలు గుప్పించడంతో ఆమెపై కోపంతో ఛాన్స్ లు రాకుండా సదరు డైరెక్టర్ అడ్డుకున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. అంతేకాదు, తమిళంలో కూడా ఇలాగే చేసిందని చెబుతారు. ఎందుకంటే ఈమెకు ఛాన్స్ లు లేవని గమనించి అవకాశం కల్పిస్తే, రెమ్యునరేషన్ సరిపోలేదన్న సాకుతో గొడవకు దిగి, తమిళంలో కూడా ఛాన్స్ లు లేకుండా చేసుకుందట.