1982 లో శోభన్ బాబు సంచలన విజయాలు ఎన్ని ఉన్నాయో…?
Sobhan Babu Hit Movies : ఇండస్ట్రీలో అందాల నటుడిగా, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా సొంతం చేసుకున్న శోభన్ బాబు ఎన్నో హిట్స్ అందుకున్నారు. అయితే 1982లో అనూహ్యంగా పలు విజయాలతో దుమ్మురేపారు. ఏకంగా పది సినిమాలు చేయగా,ఎక్కువ మూవీస్ విజయాన్ని అందుకున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే, కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో శోభన్ బాబు,లక్ష్మి,రాధ నటించిన ప్రేమమూర్తులు మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. మురళీమోహన్ కీలక పాత్రలో నటించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో శోభన్ బాబు,జయప్రద జంటగా నటించిన స్వయంవరం మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. దాసరి కూడా ఈ మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక సత్యం మ్యూజిక్ సూపర్భ్ .
సుజాత,విజయశాంతిలతో కల్సి నటించిన శోభన్ బాబు మూవీ వంశగౌరవం కమర్షియల్ గా మంచి హిట్ అందుకుంది. రవీంద్ర రెడ్డి డైరెక్టర్. తర్వాత ఇద్దరు కొడుకులు మూవీ కూడా కమర్షియల్ హిట్ సాధించింది. కట్టా సుబ్బారావు డైరెక్షన్ చేసారు. ఈ రెండు సినిమాల మూలకథ ఒకేలా ఉన్నా, లాభాలను తెచ్చిపెట్టాయి. శోభన్ బాబు, జయసుధ జంటగా నటించిన ఇల్లాలి కోరికలు మూవీ బాగానే ఆడింది. అదేసమయంలో దేవత మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. శోభన్ బాబు సరసన జయప్రద,శ్రీదేవి నటించిన ఈ మూవీకి కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసారు.చక్రవర్తి సంగీతం సూపర్భ్. కమర్షియల్ గా,మ్యూజికల్ గా హిట్ సాధించింది.
శోభన్ బాబు,మురళీమోహన్,మోహన్ బాబు ఇలా భారీ తారాగణంతో ప్రతీకారం మూవీలో శోభన్ బాబు డ్యూయెల్ రోల్ చేసారు. శారద, విజయశాంతి నటించిన ఈ మూవీ కలర్ ఫుల్ గా ఉంది. కోరుకున్న మొగుడు మూవీ కమర్షియల్ గా సక్సెస్ కొట్టింది. జయసుధ,లక్ష్మి హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీకి కట్టా సుబ్బారావు డైరెక్టర్. ఇలా హిట్ మీద హిట్ కొట్టిన శోభన్ బాబుకి బంధాలు అనుబంధాలు మూవీ ప్లాప్ తెచ్చింది. ఇందులో చిరంజీవి కూడా ఓ పాత్ర చేసాడు. ఇక కృష్ణతో కల్సి మల్టీస్టారర్ మూవీ కృష్ణార్జునులు మూవీలో నటించారు. శ్రీదేవి,జయప్రద హీరోయిన్స్. ఓపెనింగ్స్ దుమ్మురేపిన ఈ మూవీకి దాసరి దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ కూడా బాగానే సాధించి ఎవెరెజ్ అయింది.