MoviesTollywood news in telugu

అక్కినేని ,దాసరి కాంబినేషన్ సినిమాలలో ఎన్ని హిట్స్ ఉన్నాయో…?

Akkineni Nageswara Rao And Dasari Narayana Rao :తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్,అక్కినేని లను మూలస్థంభాలుగా చెబుతారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు సాంఘిక చిత్రాలతో తనదైన నటనతో ముందుకు సాగిపోతే, ఎన్టీఆర్ పౌరాణిక,జానపద,సాంఘిక చిత్రాలతో తనదైన ముద్రవేశారు. ఒక దశ దాటాక,ఎన్టీఆర్, కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో హిట్స్ ఎలా వచ్చాయో, అక్కినేని, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.

అక్కినేని, దాసరి కాంబినేషన్ లో 19మూవీస్ వచ్చాయి. అందులో సింహభాగం అంటే 12హిట్స్, 6ఏవరేజ్ గా నిలవగా, ఒక్క సినిమా మాత్రం ప్లాప్ అయింది. 1978లో వీరి కాంబోలో దేవదాసు మళ్ళీ పుట్టాడు రిలీజ్ కాగా, రికార్డ్స్ ఓపెనింగ్స్ సాధించి, ఏవరేజ్ అయింది. ఆతర్వాత రావణుడే రాముడైతే మూవీ కూడా ఏవరేజ్ అయింది.

రెండు సినిమాలు ఏవరేజ్ గా ఆడినప్పటికీ 1980లో వచ్చిన ఏడంతస్తుల మేడ సినిమా సూపర్ హిట్ కొట్టింది. వీరి కాంబోలో మొదటి హిట్ గా నిల్చింది. అదే ఏడాది వచ్చిన బుచ్చిబాబు కూడా సూపర్ హిట్ అయింది. 1981లో వచ్చిన శ్రీవారి ముచ్చట్లు మూవీతో పెద్ద హిట్ అందుకుని హ్యాట్రిక్ సాధించారు. ఇక అదే ఏడాది వచ్చిన ప్రేమాభిషేకం చరిత్ర సృష్టించింది.

దాసరి,అక్కినేని కాంబినేషన్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రేమ మందిరం భారీ అంచనాలతో వచ్చి హిట్ అయింది. అయితే 1982లో రాగాదీపం మూవీ ప్లాప్ కావడంతో వీరి హిట్ కాంబినేషన్ కి బ్రేక్ వచ్చింది. అయితే అదే ఏడాది వచ్చిన మేఘసందేశం మూవీ ఎవర్ గ్రీన్ మూవీగా నిల్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఏవరేజ్ అయింది.

అలాగే అదే ఏడాది యువరాజు మూవీ కూడా ఏవరేజ్ అయింది. అక్కినేని, దాసరి కాంబో ఇక పనిచేయదని సినీ పండితులు లెక్కలు వేసేసారు. అయితే అందరి అంచనాలను తారుమారుచేస్తూ, 1983లో రిలీజైన ఊరంతా సంక్రాంతి మూవీ సూపర్ హిట్ అయింది. అక్కినేని,సూపర్ స్టార్ కృష్ణ లతో మల్టీస్టారర్ గా ఈ మూవీ వచ్చింది.

అదే ఏడాది రాముడుకాదు కృష్ణడు, బహుదూరపు బాటసారి సూపర్ హిట్స్ కొట్టాయి. 1984లో జస్టిస్ చక్రవర్తి ఏవరేజ్ అయింది. 1986లో సోలో హీరోగా వచ్చిన ఆదిదంపతులు మూవీ హిట్ కొట్టగా, 1987లో ఆత్మబంధువులు కూడా హిట్ మూవీగా మిగిలింది. ఇక ఏడేళ్లు విరామం తర్వాత 1994లో బంగారు కుటుంబం రిలీజై, సూపర్ హిట్ అయింది. 1995లో మాయాబజార్ ఏవరేజ్ అయింది. 1996లో వీరి కాంబోలో ఆఖరి మూవీ నాయుడుగారు రాయుడుగారు కమర్షియల్ హిట్ అయింది.