MoviesTollywood news in telugu

జానకి కలగనలేదు సీరియల్ గోవిందరాజు రియల్ లైఫ్…తండ్రి ఎవరో తెలుసా?

janakikalaganaledu serial actor govinda raju :తెలుగు బుల్లితెరమీద టివి సీరియల్స్ కి మంచి క్రేజ్ ఉంది. అందునా మా టివిలో ప్రసారమయ్యే జానకి కలగనలేదు సీరియల్ కి ఇంకా క్రేజ్ ఉంది. ఇందులో నటీనటులు తమ అందంతో, నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. దీంతో నటీనటులు కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో జ్ఞానాంబ భర్త క్యారెక్టర్ లో నటిస్తున్న గోవిందరాజు విషయానికి వస్తే, ఇతడి అసలు పేరు అనిల్ అల్లం.పలు సీరియల్స్ లో నటించి సుపరిచితమైన అనిల్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించాడు.

అనిల్ పశ్చిమ గోదావరి జెడ్పి హైస్కూల్ లో సెకండరీ విద్య పూర్తిచేసి, విజయవాడ వశిష్ట కాలేజీలో ఇంటర్ పూర్తిచేసాడు. హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి,యానిమేషన్ అంటే ఇష్టం కావడంతో కెమెరామెన్ గా కెరీర్ స్టార్ట్ చేసాడు. ఫ్రెండ్ ద్వారా సీరియల్ నటించే ఛాన్స్ లభించడంతో మా ఇంటి ఆడపడుచు,వరూధిని పరిణయం,పద్మవ్యూహం వంటి సీరియల్స్ లో హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి,ఆ తర్వాత మనసు మమత,కథలో రాజకుమారి,జానకి లకగానలేదు వంటి సీరియల్స్ లో ఫాథర్ క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు.

అనిల్ చిన్నప్పటి నుంచి ఒకేచోట పెరగడంతో మరదలితోనే వివాహం జరిగింది. అనిల్,సిరి దంపతులకు ఓ పాప ఉంది. అనిల్ తండ్రి కూడా సీరియల్స్ సినిమాల్లో నటించారు. దీంతో నటన వారసత్వంగా వచ్చిందనే చెప్పాలి. బిజీ లైఫ్ కి ఇష్టపడే అనిల్ ఖాళీ సమయంలో జిమ్ చేయడానికి ఇష్టపడతాడు. భలే చాన్సులే, నువ్వు నేను, రంగం వంటి టివి షోస్ లో కూడా నటించాడు.