గొంతు సమస్యలు ఉన్నవారు ఈ ఆహారాలు తింటే…ఏమి అవుతుంది
Throat problems in telugu :గొంతు సమస్యలు ఉన్నప్పుడు సహజంగా ఆహారం తీసుకునేటప్పుడు మంచి నీటిని తాగే టప్పుడు మింగాటనికి ఇబ్బంది అవుతుంది. గొంతు సమస్యలు ఉన్నవారు వేడిగా ఉన్న పదార్ధాలు తింటే మంచి ఉపశమనం కలుగుతుంది వీరు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది. సిట్రస్ ఫలాలను అంటే నిమ్మ నారింజ కివి పైనాపిల్ వంటి పండ్లను తింటే గొంతులో ఇరిటేషన్ కలిగి ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది
టమాటా కూడా ఇంచుమించు అదే సమస్యను కలిగిస్తుంది. అలాగే చింతపండులో ఉండే పులుపు గొంతు సమస్యలు పెంచుతుంది వాపు దురదను కూడా పెంచుతుంది. చాట్ మసాలా లు పచ్చడులు గొంతు సమస్య ఉన్నప్పుడు అస్సలు తీసుకోకూడదు. అలాగే గొంతు సమస్య ఉన్నప్పుడు పెరుగు చాలా తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే పెరుగు తీసుకోవడం వల్ల శ్లేష్మం పెరుగుతుంది. దాంతో గొంతు సమస్య తీవ్రం అవుతుంది. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ కెఫీన్ ఉండే కాఫీ టీలు, బ్రెడ్ చిప్స్ వంటివి కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది.