రాజమౌళి ఈగతో సినిమా చేయటానికి అసలు కారణం ఇదేనట…!
Eega movie :ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పక్కా ప్లాన్ తోనే సినిమా చేస్తాడు. ఇంట్లో వాళ్లంతా వివిధ విభాగాల్లో సహకరించడం ప్లస్ పాయింట్. అలాంటి జక్కన్న తీసిన ఈగ మూవీ బాక్సాఫీస్ దగ్గర మోత మోగించింది. దీనికి సీక్వెల్ కూడా వస్తుందన్న ఆశతో ఫాన్స్ ఉన్నారు. జక్కన్న తండ్రి కథకుడు విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక సందర్భంలో ఈగ సీక్వెల్ ఉంటుందని చెప్పడం విశేషం.
అయితే రాజమౌళి మాత్రం ఈగ సీక్వెల్ గురించి ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. చిన్న ఈగ మనిషిపై పగబట్టి,కక్ష తీర్చుకునే తీరు ఆడియన్స్ ని మతిపోగొట్టింది. అసలు ఈగ సినిమా తీయడమే ఓ వింత. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిన మగధీర మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్. అద్భుతమైన విజువల్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర కాసుల పంట పండించింది.
మర్యాద రామన్న తర్వాత ప్రభాస్ తో మూవీకి 5నెలల విరామం ఉండడంతో ఈలోగా తక్కువ బడ్జెట్ లో ఈగ మూవీకి జక్కన్న ప్లాన్ చేసాడు. తీరా దిగాక మూడు కోట్లు చాలవని తెలియడంతో దగ్గుబాటి సురేష్ బాబు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని చెప్పడంతో ఈగ గ్రాఫిక్స్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. సంచలన విజయాన్ని నమోదు చేసింది.