ఆమని ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా…భర్త,కొడుకుని చూసారా…!
Tollywood Heroine amani :తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వచ్చి వెళ్తుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దుమ్మురేపే హీరోయిన్స్ ఉన్నారు. అయితే కొందరు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అందులో ఒకప్పటి హీరోయిన్ ఆమని ఒకరు. ఈమె అసలు పేరు మంజుల. మావిచిగురు,శుభలగ్నం, శుభ సంకల్పం సినిమాలలో ఆమని నటన అద్భుతం. అయితే మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ రాలేదు. అంతలోనే పెళ్లవ్వడం,కుటుంబ వ్యవహారాల్లో బిజీ అయిపోవడం అయింది.
నిజానికి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ గల ఫ్యామిలీ నుంచి ఆమని ఇండస్ట్రీకి వచ్చింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆమని తండ్రి ఓ చిన్న ఫిలిం డిస్ట్రిబ్యూటర్. అనంతపురం స్వస్థలం అయినప్పటికీ బెంగళూరు వెళ్లిపోయారు. సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఆమెకు ఆశ. దాంతో చెన్నైలో గల ఓ డిస్ట్రిబ్యూటర్ ద్వారా సినిమాల్లోకి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇక ఓ సినిమా చేసినా పెద్దగా పేరు రాలేదు.
అనుకోకుండా స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన హాస్య భరిత చిత్రం జంబలికడి పంబ మూవీలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాల్లో బిజీగా ఉండగానే ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆమని ఇండస్ట్రీకి దూరంగా జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న ఆమని రీ ఎంట్రీ ఇవ్వాలని పలువురు అభిమానులు కోరుతున్నారు.