బాలయ్యకి ఇచ్చిన వరకట్నం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
How much dowry taken by balakrishna :తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ నటవారసుడిగా అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఎన్టీఆర్,బసవతారకం దంపతులకు ఏకంగా 11మంది సంతానం. అందులో ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అయితే హరికృష్ణ కొన్ని సినిమాల్లో చేసినా , చివరకు ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం బాలయ్యే. మెగాస్టార్ చిరంజీవి,బాలయ్య మధ్య గట్టి పోటీ నడిచింది.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఆయనతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు కి బాలయ్యకు పెళ్లి చేసే బాధ్యత ఎన్టీఆర్ అప్పగించారు. అసలు నాదెండ్ల బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాలనుకున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ ఫ్యామిలీకి చెందిన వసుందరను నాదెండ్ల సెలక్ట్ చేసారు.
ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్యూలో నాదెండ్ల షేర్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగుతున్న బాలయ్యకు వసుంధరను ఇచ్చి పెళ్లి చేసిన సందర్బంగా ఆమె పుట్టింటి వాళ్ళు 10లక్షలు కట్నంగా ఇచ్చారట. ఆ డబ్బుతోనే ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఇల్లు కట్టినట్లు కూడా నాదెండ్ల చెప్పుకొచ్చారు. నిజానికి కట్నం కోసం బాలయ్య ఆలోచన చేయకపోయినా,కట్నం వచ్చింది