MoviesTollywood news in telugu

గృహలక్ష్మి సీరియల్ మాధవి రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించిందో…?

Gruhalakshmi serial Madhavi :బుల్లితెర మీద సీరియల్స్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. అందుకే అన్ని సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ధారావాహికంగా నడుస్తున్నాయి. ఇక మా టివిలో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తున్నారు. అందుకే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఒక ఇంటి ఇల్లాలు తమ కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతోందో ఈ సీరియల్ నిరూపిస్తోంది.

ఈ సీరియల్ లో ఎప్పుడూ మంచి కోరుకునే మాధవి పాత్రలో నటిస్తున్న వ్యక్తి గురించి వివరాల్లోకి వెళ్తే, ఈమె అసలు పేరు మాధవీలత.ఎస్పీ ఆర్ రెడ్డి కాలేజీలో స్టడీస్ పూర్తిచేసింది. చిన్ననాటి నుంచి డాన్స్, నటన ఇష్టం కావడంతో స్కూల్స్, కాలేజీలో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆకట్టుకుంది. డాన్స్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పదేళ్లు బ్యూటీ పార్లర్ నడిపింది.

మాధవీలత ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నటి కావాలన్న ఆంకాక్షతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో కూడా చేసింది. మూడు ముళ్ళ బంధం,ఆడదే ఆధారం,శ్రీనివాస కళ్యాణం,కల్యాణ వైభోగమే,హిట్లర్ గారి పెళ్ళాం, గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో చేసి,ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. టాప్ టీఆర్ఫీ రేటింగ్ లో దూసుకెళ్తున్న గృహలక్ష్మి సీరియల్ లో తన నటన ద్వారా ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.