Jogging:జాగింగ్ ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు చేస్తే మంచిది…
jogging Benefits In telugu :ప్రతి మనిషి ప్రతిరోజు జాగింగ్ చేయాల్సిందే. జాగింగ్ చేస్తేనే శరీరం ఫిట్ గా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనలో చాలా మంది వ్యాయామం చెయ్యటానికి బద్దకిస్తూ ఉంటారు. అలాంటి వారికి జాగింగ్ చాలా బాగా సహాయ పడుతుంది.జాగింగ్ చేయడం వలన శరీరం మొత్తానికి వ్యాయామం లభించి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతిరోజు అరగంట జాగింగ్ చేస్తే ఫిట్నెస్ రావటంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మనలో చాలా మందికి జాగింగ్ అనేది ఉదయం చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం ఉంటుంది. కొంతమంది ఉదయాన్నే లేచి జాగింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయం తొందరగా లేవలేక సాయంత్రం సమయంలో జాగింగ్ చేస్తూ ఉంటారు.
ఆరోగ్య నిపుణులు మాత్రం ఉదయం కంటే సాయంత్రం సమయంలో జాగింగ్ చేస్తే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అలాగే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారని అంటున్నారు. ఉదయం చేసినా మంచిదే కానీ సాయంత్రం సమయంలో చేసే జాగింగ్ వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
రోజులో 30 నుంచి 90 నిమిషాల పాటు జాగింగ్ చేయాలట. ప్రతి రోజు కుదరనివారు వారంలో కనీసం రెండున్నర గంటల పాటు జాగింగ్ చేయాలట. ఒకవేళ వాకింగ్ చేయాలని అనుకుంటే రోజుకి గంట సేపు వాకింగ్ చేయాలంట. ఇలా మీకు నచ్చిన జాగింగ్ లేదా వాకింగ్ చేస్తూ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి దాన్ని బరువు తగ్గండి. అలాగే డయాబెటిస్ గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.