MoviesTollywood news in telugu

దిల్ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Dil movie heroine neha bamb :అది మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో చేసి, తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఆతర్వాత నితిన్ తో చేసిన దిల్ మూవీ సూపర్ హిట్ అయింది. గ్రామీణ నేపధ్యం, పట్టణ వాతావరణం మిళితమైన ఈ సినిమాలో ప్రేమ కోసం హీరో చేసిన సాహసం, అందుకు విద్యార్థులు అండగా నిలవడం బాగా ఆకట్టుకున్నాయి.

అందుకే దిల్ సీనిమా హిట్ అయింది. ఈ సినిమాతోనే ప్రొడ్యూసర్ రాజు దిల్ రాజుగా వ్యవహారంలోకి వచ్చాడు. ఇక ఈ సినిమాలో నందిని పాత్రలో హీరోయిన్ నేహబాంబ్ తన అందంతో,అభినయంతో బాగా ఆకట్టుకుంది. ఆతర్వాత అతడే ఒక సైన్యం, దోస్త్ మూవీస్ లో నటించినప్పటికీ పెద్దగా ఆడలేదు. దీంతో బొమ్మరిల్లు,దుబాయి శీను మూవీస్ లో సైడ్ రోల్స్ చేసింది.

అయినా క్లిక్ కాకపోవడంతో బాలీవుడ్ కి చేరినా అక్కడ నిరాశే ఎదురైంది. అయినా నటనపై మక్కువతో హిందీ సీరియల్ తో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. రిషి రాజ్ అనే వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్న ఈ అమ్మడుకి ఓ పాప ఉంది. దిల్ సినిమా హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తుందని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ అయినా స్టార్ట్ చేస్తుందో లేదో చూడాలి.