MoviesTollywood news in telugu

బిగ్ బాస్ తర్వాత ప్రిన్స్ ఏమి చేస్తున్నాడో తెలుసా?

Tollywood hero Prince : అందం, అభినయం ఉన్నా సరే, అదృష్టం కూడా ఉంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు. లేకుంటే కష్టమే. అందుకే చాలామంది హీరో హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే ఫేడ్ అవుట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ రియాల్టీ షో లో కంటెస్టెంట్ గా చేస్తే కూడా ఛాన్స్ లు తగ్గిపోతాయన్న ప్రచారం ఉంది. ఎందుకంటే, చాలామంది బిగ్ బాస్ తర్వాత ఎడ్రెస్ కోల్పోయారు. అందులో హీరో ప్రిన్స్ ఒకడు.

2017 బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న ప్రిన్స్ 2012లో ఇండస్ట్రీకి హీరోగా వచ్చాడు. డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన నీకు నాకు డాష్ డాష్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ ఆతర్వాత రొమాన్స్, బస్టాప్ వంటి చిన్న సినిమాలు చేసి ఓ మోస్తరు గుర్తింపు పొందాడు.

ఆతర్వాత చేసిన సినిమాలు ఏవీ కల్సి రాలేదు. కథల విషయం కావచ్చు, మరొకటి కావచ్చు మొత్తానికి దెబ్బతిన్నాడు. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత కూడా ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు. అదృష్టం లేకపోవడంతో పాటు బిగ్ బాస్ దురదృష్టం కూడా ప్రిన్స్ ని వెంటాడుతోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మంచి అవకాశాలు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.