Beauty Tips

Eyes Carry Bags : కళ్ల కింద క్యారీ బ్యాగులా?…ఏం చేయాలంటే..

Eyes Carry Bags : కళ్ల కింద క్యారీ బ్యాగులా?…ఏం చేయాలంటే.. వయస్సు పెరిగే కొద్దీ చాలా మందిలో కళ్ల క్రింది బాగంలో చర్మం పలుచబడి వేలాడుతూ ఉంటుంది. వీటినే మనం కళ్ల కింద క్యారీ బాగులు అంటుంటాం. ఈ క్యారీ బాగుల్లోకి ఫ్లూయిడ్స్ వచ్చి చేరుతుంటాయి.

వయసుతోపాటు టియర్ గ్లాండ్స్ సరిగా పనిచేయక లూబ్రికేషన్స్ తేడాలు రావటంతో కళ్ల క్రింద వాపు వస్తుంది. ఈ సమస్య చిన్నపెద్దా తేడా లేకుండా అందరిలో కనిపిస్తుంది. ప్రస్తుతం మారిన జీవన శైలి,హార్మోన్ల అసమతుల్యత,ఒత్తిడి,ఆహారపు అలవాట్లు,పోషకాహార లోపం నిద్రలేమి వంటి సమస్యలతో కళ్ళ కింద క్యారీ బ్యాగులు (అంటే ఉబ్బినట్టుగా కనిపించడం) వస్తూ ఉంటాయి.

దాంతో చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడతారు వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.. కంగారూ పడి మార్కెట్ లో దొరికే ఎటువంటి క్రీమ్ లు వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.

అవకాడో పండు మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొంచెం తేనె కలిపి కంటి కింద అప్లై చేయాలి. పదిహేను నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది

బాదం ఆయిల్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బాదం ఆయిల్ కంటికింద పైన రాసి సున్నితంగా మసాజ్ చేయాలి ఈ విధంగా రాత్రి పడుకునే ముందు చేసి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News