కొరియాగ్రాఫర్ శేఖర్ మాస్టర్ లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…?
Sekhar Master LifeStyle :ఒకప్పుడు సినిమాల్లో డాన్స్ కోసం తమిళ పరిశ్రమ నుంచి కొరియోగ్రాఫర్స్ ని తెచ్చుకునేవారు. అయితే తెలుగు ఇండస్ట్రీకి మనమే డాన్స్ కంపోజ్ చేయాలన్న సంకల్పంతో శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ప్రతి సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తప్పనిసరి అయింది. ఇతడి పూర్తి పేరు జెవి శేఖర్. ఏపీలోని విజయవాడలో 1979 నవంబర్ 6న జెవి విజయం, శకుంతల విజయం దంపతులకు జన్మించిన శేఖర్ మాస్టర్ కి ప్రస్తుతం 42 ఏళ్ళు పూర్తవుతాయి. ఇతడికి ప్రసాద్,సుధాకర్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు.విజయవాడ అన్నా థామస్ స్కూల్ లో,అలాగే శారదా కాలేజీలలో స్టడీస్ పూర్తిచేసాడు.
2003లో పెద్దల ఆశీర్వదంతో సుజాతతో శేఖర్ మాస్టర్ కి పెళ్లయింది. విన్నీ అనే కొడుకు, సాహితి అనే కూతురు ఉన్నారు. స్కూల్లో చదివే రోజుల్లో డాన్స్ పిచ్చి తో తండ్రి జేబులో డబ్బులు కొట్టేసి సినిమాలు చూసేవాడు. అందునా చిరంజీవి సినిమాలంటే ప్రాణంగా చూసేవాడు. ఆరవ తరగతి చదివేటప్పుడే తండ్రి చనిపోవడంతో కష్టపడి చదువుకున్నాడు. డాన్స్ మీద మక్కువతో హైదరాబాద్ వచ్చేసి, రాకేష్ మాస్టర్ దగ్గర తక్కువ డబ్బుతో డాన్స్ నేర్చుకున్నాడు. నెలకు 300 కట్టేవాడు. ఢీ షోలో తన గ్రూప్ లో శేఖర్ మాస్టర్ ని పెట్టుకున్న రాకేష్ మాస్టర్, ఢీ 2లో కొరియోగ్రఫీలో పెట్టుకున్నారు. అయినా పేరు రాలేదు.
ఇక ఢీ 5షోలో తన టీమ్ తో పాల్గొని శేఖర్ మాస్టర్ విన్నర్ అయ్యాడు. సుధీర్ బాబు హీరోగా నటించిన శివ మనసులో శృతి ఎస్ ఎం ఎస్ మూవీలో కొరియోగ్రఫీ చేసి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఒక పాటకు లక్షన్నర వరకూ అందుకునే శేఖర్ మాస్టర్ సినిమా మొత్తం సాంగ్స్ కి 10లక్షల వరకూ తీసుకుంటున్నాడు. టివి షోస్ కూడా చేస్తున్నందున ఒక్కో టివి షో కి రెండున్నర లక్షల వరకూ అందుకుంటున్నాడు.నెట్ వర్త్ 10కోట్లు ఉంటుంది. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సమంత అంటే ఇష్టం. ప్రభుదేవా ఇష్టమైన డాన్సర్. కాశ్మిర్ అంటే ఇష్టం. హైదరాబాద్ కృష్ణానగర్ శ్రీ గాయత్రీ హైడ్ అపార్ట్ మెంట్స్ లో 80లక్షల విలువైన ఫ్లాట్ లో ఉంటున్న శేఖర్ కి రెండు కార్లు ఉన్నాయి.