MoviesTollywood news in telugu

మహేష్ రానున్న సినిమాలో విలన్ గా బాలీవుడ్ STAR హీరో

Mahesh Babu New movie : సినిమాలకు సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని పుకార్లుంటాయి. అయితే క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు. ఈలోగా వైరల్ అయిపోతుంటాయి. తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేయబోయే సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడట.

మహేష్ కెరీర్ లో అతడు మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అదరగొట్టేసింది. అందుకే వీరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఆతృతగా ఫాన్స్ ఎదురుచూస్తుంటారు. ఇక వీరి కాంబినేషన్ తర్వాత ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా రానుంది. డాక్టర్ కె ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తారు.

అయితే మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన అతడు మూవీ తర్వాత ఖలేజా ఆ రేంజ్ లో లేదు. అయినా వీరి కాంబినేషన్ కి క్రేజ్ ఉంది. అందుకే హ్యాట్రిక్ మూవీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా తెరకెక్కనున్న నేపథ్యంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు టాక్.