MoviesTollywood news in telugu

హీరో సునీల్ రియల్ లైఫ్..ఎన్ని కోట్ల అస్థి ఉందో…?

Tollywood Hero Sunil :ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర పెద్ద పాలేరు ప్రాంతానికి చెందిన సునీల్ టాలీవుడ్ లోకి నువ్వే కావాలి మూవీతో ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా అలరించాడు. వరుస సినిమాల్లో కామెడీ పండిస్తూ, అందాలరాముడు మూవీతో హీరో అయ్యాడు. ఇతడి అసలు పేరు ఇందుకూరి సునీల్ వర్మ. 1974 ఫిబ్రవరి 28న పుట్టిన సునీల్ కి ప్రస్తుతం 47 ఏళ్ళు పూర్తయ్యాయి. సెయింట్ మేరీస్ హైస్కూల్, ఆంధ్ర కస్తూరిబా గవర్నమెంట్ కాలేజీ లలో భీమవరంలోని స్టడీస్ పూర్తిచేసాడు. కాలేజీ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. ఆయన నటించిన గ్యాంగ్ లీడర్ వంటి సినిమాల్లో సాంగ్స్ కి డాన్స్ చేసి అలరించేవాడు.

తండ్రి చిన్నప్పుడే చనిపోగా,అన్నీ తల్లి చూసుకుని పెంచారు. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేది. జాబ్ చేయమంటే వద్దని చెప్పి, తన దగ్గర ఉన్న బైక్ అమ్మేసి,సినిమా ఛాన్స్ ల కోసం హైదరాబాద్ వచ్చేసాడు. ఇక ఇతనితో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కల్సి ఉండేవాడు. అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే,2000లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలి మూవీలో తరుణ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా విజయంతో మంచి గుర్తింపు రావడంతో వరుస ఛాన్స్ లు వచ్చాయి.

2002లో పెద్దల అంగీకారంతో శృతి ఇందుకూరితో ఘనంగా పెళ్లయింది. కుందన అనే కూతురు, దుశ్యంత్ అనే కొడుకు ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకే కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, బ్రహ్మానందం,అలీ కి ధీటుగా ఎదిగాడు. అందాల రాముడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, 80లక్షలు అందుకున్నాడు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి తీసిన మర్యాదరామన్న మూవీలో హీరోగా చేయడంతో మంచి ఇమేజ్ వచ్చింది.

ఇటీవల కలర్ ఫోటో మూవీలో చేసినందుకు 40లక్షల కన్నా ఎక్కువే అందుకున్నాడు. ఒక్కో మూవీకి 70లక్షల వరకూ తీసుకునే సునీల్ నెట్ వర్త్ 40కోట్లు. హీరోల్లో చిరంజీవి,హీరోయిన్స్ లో అమల ఇష్టం. వైజాగ్ ఇష్టమైన ప్రదేశం. దోశ అంటే ఇష్టం. హైదరాబాద్ ప్రశాంత్ నగర్ జూబ్లీ హిల్స్ రోడ్డు 72లో ఉంటున్నాడు. రెండు సౌకర్యవంతమైన కార్లు ఉన్నాయి.