కేరాఫ్ అనసూయ సీరియల్ నటుడు చందు రియల్ లైఫ్
care of anasuya chandu prajwal : కేరాఫ్ అనసూయ సీరియల్ ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతూ ఆడియన్స్ లో ఆసక్తి రేపుతోంది. ఇందులోని నటీనటులు తమ అందంతో అభినయంతో ఆకట్టుకుంటున్నారు. నటుడు చందు ఈ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తొలిసీరియల్ తోనే తన నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాడు.
చందు అసలు ఇరు ప్రజ్వల్ రవి. సెప్టెంబర్ 4న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ లో ప్రజ్వల్ జన్మించాడు. ప్రస్తుతం బెంగుళూరులోనే ఉంటున్న ఇతడికి చిన్ననాటి నుంచి డాన్స్,నటన అంటే మక్కువ. దాంతో గ్రాడ్యుయేషన్ కంప్లిట్ కాగానే తన కెరీర్ ని మోడల్ గా స్టార్ట్ చేసాడు.
తర్వాత రణతంత్ర,చౌకట్టు, విక్రమ చిత్ర వంటి కన్నడ మూవీస్ లో చందు నటించాడు. శాంతం పాపం అనే సీరియల్ తో కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. అతడు నటించిన కన్నడ సీరియల్ అమృతవర్షిణి హిట్ కావడంతో మంచి క్రేజ్ వచ్చింది. కేరాఫ్ అనసూయతో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి, చందుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కన్నీటి కడలి అనే తెలుగు మూవీలో విలన్ గా చేయబోతున్నాడు.