కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో ఆడిపాడిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?
Tollywood Heroine Kajal aggerwal : లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు అయినా అదే జోరు కొనసాగిస్తున్న కాజల్ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ అల్లు అర్జున్ ల తో పాటు చిరంజీవి వంటి సీనియర్ హీరోలతో కూడా ఆడిపాడింది.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో, నాగార్జున సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన మగధీర సినిమాతో ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతోంది. ఒకవైపు కుర్ర హీరోలతోను మరో వైపు సీనియర్ హీరోలతోను జోడీ కట్టి మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంది.