సీరియల్ హీరో రవికృష్ణ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?
Telugu Serial actor Ravi Krishna :పలు సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న రవికృష్ణ 1989 June 9న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించాడు. ప్రస్తుతం ఇతడికి 32ఏళ్ళు నిండాయి. రవి, పార్ధు అనే నిక్ నేమ్స్ ఉన్నాయి. ఇతడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి. రవి కృష్ణకు ఓ బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు.
సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు గల రవికృష్ణ 6వ తరగతి నుంచే యాక్టింగ్ పై మక్కువ ఏర్పరచుకున్నాడు. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇంటర్ అయ్యాక నటుడిని అవుతానని ఇంట్లో చెప్పేయడంతో ఇంట్లో వాళ్ళు నో చెప్పారు.
అయితే రవికృష్ణ ను అతడి మామయ్య ఎంకరేజ్ చేయడంతో డిగ్రీ పూర్తిచేసి, చెన్నై చేరాడు. అక్కడ ఛాన్స్ లు రాలేదు. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే యాక్టర్ అవ్వడం కోసం ట్రై చేసాడు. ఈటీవీలో హృదయం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తరువాత బొమ్మరిల్లు సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ లో హీరోగా చేసాడు.
భార్యామణి సీరియల్ చేసాక కొన్ని రోజులు యాక్టింగ్ కి దూరమయ్యాడు. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఈలోగా మొగలి రేకులు సీరియల్ లో సెలక్ట్ అయ్యాడు. జీటీవీలో వరూధిని పరిణయం సీరియల్ లో పార్ధు గా హీరో రోల్ చేసి మంచి గుర్తింపు పొందాడు.
స్టార్ మాలో శ్రీనివాస కళ్యాణం సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. ఇలా సీరియల్స్ తో బిజీగా ఉండగానే తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రిలో కంటెస్టెంట్ గా వచ్చాడు. తర్వాత ఆమె కథ సీరియల్ లో చేసాడు. మొదటిసారి బుల్లితెరపై ఒక ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ 5వేలు తీసుకోగా, ఇప్పుడు వారానికి లక్షన్నర అందుకుంటున్నాడు.
ఒక్కో ఎపిసోడ్ కి 20వేలవరకూ అందుకునే ఇతడి నెట్ వర్త్ 4కోట్లు. క్రికెట్ ఆడడం హాబీ. ఇతడి ఫేవరేట్ హీరోస్ చిరంజీవి, నాగార్జున. సావిత్రి, శ్రీదేవి ఫేవరేట్ హీరోయిన్స్. న్యూజిలాండ్ అంటే ఇష్టమైన ప్రదేశం. మణికొండ గేటెడ్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న రవికృష్ణకు రెండు కార్లున్నాయి.