Unwanted Hair remedies:పైసా ఖర్చు లేకుండా అవాంచిత రోమాలు శాశ్వతంగా రాలిపోయే చిట్కా
Unwanted Hair remedies :ముఖానికి ఫేషియల్, మేకప్ ఇలా ఎన్ని చేసినా అవాంఛిత రోమాలు అంటే పై పెదవి, గడ్డం, చెవి పక్కన ఉండి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ అవాంఛిత రోమాలు రావడానికి రకరకాల కారణాలు ఉన్నా వీటిని త్రెడ్డింగ్ ఫక్కింగ్ వంటి నొప్పి కలిగించే పద్ధతుల్లో నిర్మూలించిన పెరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా సహజసిద్ధంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
దీనికోసం ఒక బౌల్లో ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ములేటి పౌడర్, ఒక స్పూన్ తేనె ,అర స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ ఉందో అక్కడ రాసి అలా వదిలేయాలి. ఆరిన తర్వాత కింది నుంచి పైకి ఈ ప్యాక్ ని నలపడం ద్వారా అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి.
ఆ తర్వాత పటిక బెల్లం ముక్కతో ముఖాన్ని మసాజ్ చేయాలి. పటిక కూడా అవాంఛిత రోమాలు తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా నెలరోజులపాటు చేస్తే అవాంఛిత రోమాల సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.