కార్తీక దీపం సీరియల్ కి శుభం కార్డ్ పడనుందా…వంటలక్కను చూడలేమా…?
karthika deepam Serial : గత కొన్నాళ్లుగా ఎవరి నోటా విన్నా కార్తీక దీపం సీరియల్ గురించే. ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ ,సీరియల్ వచ్చే సమయానికి బుల్లితెర ముందు ఠక్కున వాలిపోతున్నారు. వృద్ధులు,మహిళలు అనే తేడా లేకుండా యూత్ కూడా బాగా ఈ సీరియల్ కి కనెక్ట్ అయ్యారు. దీనికి తోడు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఈ సీరియల్ నడుస్తోంది. ఎక్కడ మిస్సయిపోతామోనని అందరూ ఆతృతగా సీరియల్ కి అతుక్కుపోతున్నారు.
ఇక ట్విస్టులు లేకపోతె నెలరోజుల్లో ఈ సీరియల్ కి శుభం కార్డు పడుతుందని టాక్. సీరియల్ ముగిసిపోతుందన్న ఆత్రుత కన్నా ఇందులో వంటలక్క పాత్రలో అలరిస్తున్న ప్రేమీ విశ్వనాధ్ ఇక తెలుగు బుల్లితెరపై కనిపిస్తుందా లేదా అనే బెంగ చాలామందిలో నెలకొందని టాక్. ఇప్పటికే ఈ సీరియల్ లో పెళ్లి సీన్ పెటాకులవ్వడం,మోనిత గురించి నిజాలు తెలుసుకున్న కార్తీక్ కోపంతో రగిలిపోతూ తుపాకీ గురిపెడతాడు.
అయితే కాల్చింది మాత్రం ఎవరో తెలీకుండా ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. అయితే మోనిత ను కార్తీక్ చంపేసి,శవం మాయం చేసాడని రోషిని అనుమానిస్తోంది. ఇదే సమయంలో అమెరికాలో ఉంటున్న సౌందర్య ఎంట్రీ ఇచ్చి, తానే చంపానని, కొడుకు తప్పేమీ లేదని లొంగి పోతుంది. ఇవన్నీ చూస్తే త్వరలో శుభం కార్డు పడుతుందా, ఇంకా ఏమైనా ట్విస్టులతో సాగదీస్తాడా అనేది సస్పెన్స్. మరో నెలరోజుల్లో విషయం ఏంటన్నది క్లారిటీ వస్తుందని అంటున్నారు.