హీరోయిన్ అమలాపాల్ పేరెంట్స్ ఏమి చేస్తారో తెలుసా?
Amala paul Mother And father : ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా,తన బ్రదర్ అభిజిత్ ఎంకరేజ్ మెంట్ తో ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ అమలాపాల్ తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ మూవీస్ లో చేస్తోంది. నిజానికి ఈమె పేరెంట్స్ వద్దని వారించినప్పటికీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్ మూవీస్ లో చేసింది. అయితే నాయక్ సినిమాకు వచ్చిన గుర్తింపు తప్ప మరో సినిమాకు గుర్తింపు రాలేదు.
పెళ్లి ,విడాకుల ద్వారా కూడా పాపులర్ అయిన ఈమె 2009లో ఇంటర్ పూర్తిచేశాక షార్ట్ ఫిలిమ్స్ లో ఎంటర్ అయింది. తర్వాత మలయాళ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో 2014లో పెళ్లయిన అమలాపాల్ ఆతర్వాత మూడేళ్లకే విడాకులు అందుకుని వార్తల్లోకి ఎక్కింది.
డైరెక్టర్ విజయ్ మళ్ళీ పెళ్లిచేసుకున్నా సరే, అమలాపాల్ ఇంకా విడిగానే ఉంటోంది. ఈమె కేరళలో పుట్టింది. ఈమె తండ్రి పాల్ కష్టమ్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి అన్నీస్ సింగర్ గా స్టేజ్ షోస్ ఇవ్వకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హోదాతో దూసుకెళ్తూ, వెబ్ సిరీస్ కి కూడా ఒకే చెబుతోంది అమలా పాల్.