MoviesTollywood news in telugu

సమంత సోషల్ మీడియా పోస్ట్ కి ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా?

star heroine samantha remuneration for instagram posts :అక్కినేని కోడలు సమంత సినిమాల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తూ, మరోపక్క వెబ్ సిరీస్ చేస్తోంది. అంతేకాదు, ఆహా ఓటిటి ఫ్లాట్ ఫారం మీద ఎందరినో ఇంటర్యూ చేసి, కోట్లు సంపాదించింది. యాడ్స్ లో చేయడం, అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తన సంపాదన పెంచుకుంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్తూ అక్కడా సంపాదిస్తోంది.

ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ లో తన సత్తా చాటుతున్న సమంత తాజాగా గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం మూవీలో నటిస్తోంది. భారీ బడ్జెట్ మూవీస్ కి ఒకే చెబుతూ కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాదు,సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత దీని ద్వారా కూడా బాగానే కూడబెడుతోందని టాక్.

ఈమె ఇంస్టా గ్రామ్ కి దాదాపు 18మిలియన్స్ మంది ఫాలోయర్స్ ఉన్నారంటే ఈమె రేంజ్ ఏమిటో తెలుస్తుంది. ఇంత భారీ ఫాలోయింగ్ ఉండడం వలన ఈమె పెట్టె పోస్టులకు ఆదాయం వస్తోంది. ఈమె పెడుతున్న ఒక్కో పోస్టుకి 25నుంచి 30లక్షలు అందుకుంటోందట. అంతలా ప్రోడక్ట్స్ కి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా ప్రచారం కల్పిస్తోంది.