MoviesTollywood news in telugu

అడవిదొంగ మూవీకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Chiranjeevi Adavi Donga Movie:దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన అడవిదొంగ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. టార్జాన్ మాదిరిగా ఉండే పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు. శారద తల్లి పాత్రలో కీలక భూమిక వహించింది. హీరోయిన్ రాధ గ్లామర్ అదిరింది. బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ 1985 సెప్టెంబర్ 19న రిలీజయింది. అయితే ఈ సినిమా సమయంలో కొన్ని సినిమాలు రిలీజయ్యాయి.

అడవిదొంగకు వారం రోజుల తర్వాత డాక్టర్ రాజశేఖర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూ నటించిన వందేమాతరం మూవీ వచ్చింది. టి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన పచ్చని కాపురం మూవీ అడవి దొంగకు 13రోజుల గ్యాప్ తో రిలీజయింది. శ్రీదేవి హీరోయిన్.

ఈ మూవీలో వెన్నలైనా చీకటైన సాంగ్ రెండు వెర్షన్స్ లో జేసుదాసు ఆలపించడంతో బ్లాక్ బస్టర్ సాంగ్ అయింది. తాతినేని రామారావు డైరెక్టర్. ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 6న సుమన్ నటించిన దొంగల్లో దొర మూవీ. దీనికి విజయ బాపినీడు డైరెక్టర్. సుమన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. విజయశాంతి, అరుణ హీరోయిన్స్. అడవిదొంగ మూవీ నెంబర్ వన్ స్థానంలో ఉంటె,పచ్చని కాపురం మూవీ సెకండ్ ప్లేస్. వందేమాతరం థర్డ్ ప్లేస్.