MoviesTollywood news in telugu

స్టార్ హీరోలకు ధీటుగా రావు రమేష్ రెమ్యునరేషన్…తెలిస్తే షాక్…?

Rao ramesh remuneration per movie :అంతకు ముందు చాలా సినిమాలు చేసినప్పటికీ ముత్యాల ముగ్గు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ నటుడుగా మారిపోయిన ప్రముఖ నటుడు రావు గోపాలరావు విభిన్న క్యారెక్టర్స్ తో నటుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విలన్ గా,కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్ర అయినా అదరగొట్టేసారు. తెలుగుదేశం పార్టీలో చేరి, రాజ్యసభ సభ్యునిగా పనిచేసారు. ఆయన మరణం తర్వాత వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్‌ కూడా నటుడుగా విలక్షణ గుర్తింపు తెచ్చుకున్నాడు.

రావు గోపాలరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టినప్పటికీ రావు రమేష్ నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. గమ్యం,కొత్త బంగారు లోకం,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,దువ్వాడ జగన్నాధం,సన్నాఫ్ సత్యమూర్తి ఇలా చాలా సినిమాల్లో విలక్షణ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రావు రమేష్ రెమ్యునరేషన్ లో కూడా రికార్డు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించనున్న ఈ సినిమా త్వరలోనే స్క్రిప్టు పనులు పూర్తయితే పట్టాలెక్కుతుంది.

నిజానికి మలయాళ సూపర్‌ హిట్‌ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో లో రావు రమేష్‌ ప్రముఖ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, ఎక్కువ కాల్షీట్లు కారణంగా ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రెమ్యునరేషన్‌ విషయంలో ఇది ఓ రికార్డుగా సినిమా పండితులు చెబుతున్నారు. స్టార్ హీరోలకు ధీటుగా రావు రమేష్‌ రెమ్యునరేషన్ అందుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.