MoviesTollywood news in telugu

తమన్నా రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Star heroine tamannah rejected movies :చాలామంది హీరో హీరోయిన్స్ తమ కెరీర్ లో కొన్ని సినిమాలను వివిధ కారణాల వలన వదులుకోవాల్సి వస్తుంది. కాల్ షీట్స్ కుదరక పోవడం, పాత్ర నచ్చక పోవడం ఇలా పలు కారణాలు ఉంటాయి. ఇక 16ఏళ్లకే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి లాంటి మూవీస్ లో చేసి తనకు ఓ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే ఈమె కూడా కొన్ని సినిమాలను వదులుకుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో తమన్నా ఛాన్స్ వదిలేసుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ మూవీలో తమన్నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అయితే పలు కారణాల వలన చేయలేకపోయింది. తమిళంలో ఏ ఆర్ మురుగుదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీలో కూడా ఛాన్స్ వదులుకుంది.

నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి మూవీలో కూడా తమన్నా హీరోయిన్ ఛాన్స్ వదులుకుంది. ఆషికి 2మూవీకి తమన్నాకే ఛాన్స్ వచ్చినా ఎందుకో వదిలేసింది.

రమేష్ వర్మ, మాస్ మహారాజ్ రవితేజ కాంబోలో తెరకెక్కిన ఒక మూవీలో కూడా తమన్నా ఛాన్స్ మిస్ చేసుకుంది. రామ్ హీరోగా వచ్చిన శివమ్ మూవీలో కూడా ఛాన్స్ కాదనుకుంది. రాజుగారి గది3, స్పీడున్నోడు వంటి సినిమాలను కూడా వదులుకుంది. అలాగే గతంలో వెంకటేష్, తేజ కాంబోలో రూపొందాల్సిన సినిమా పలు కారణాలతో ఆగిపోయింది. ఇందులో కూడా తమన్నా హీరోయిన్ ఛాన్స్ వదిలేసింది.