భోజనం అయ్యాక సోంపు తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు
fennel Seeds Benefits In telugu : చూడటానికి చాలా చిన్నగా ఉండే సోంపు గింజలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గింజలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం,పొటాషియం విటమిన్ ఏ,విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి సోంపు గింజలు కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది అందుకే మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపు గింజలు నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు
ఈ విధంగా నమలటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయి గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉండవు. జీవక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో క్యాలరీలు వేగంగా కరిగి బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. సోంపు నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది. మంచి నిద్రకు మెలటోనిన్ అనే హార్మోన్ కారణం. సోంపు గింజలు మెలటోనిన్ స్రవించడానికి పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. దాంతో మంచి నిద్ర పడుతుంది.
పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే హృదయ స్పందన రేటు అదుపులో ఉంటుంది దానితో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ సోంపు గింజలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన సోంపు గింజలను తింటూ ఆ నీటిని తాగితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.