Healthhealth tips in telugu

ఈ ఆకు నిజంగా బంగారం లాంటిదే.. ఈ రహస్యాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..ఇది నిజం

Lemon Leaves Health benefits In telugu :మనం నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ .మనం నిమ్మ ఆకులు గురించి పెద్దగా పట్టించుకోము. నిమ్మ ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
Lemon Leaves benefits
కొన్ని దేశాలలో వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకుల రసాన్ని సువాసన ఏజెంట్ గా ఉపయోగిస్తారు. అలాగే తాజా రసం టీ గా కూడా తీసుకుంటూ ఉంటారు. నిమ్మ ఆకులను 5 తీసుకుని వేడి నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత వడకట్టి రెండు నెలలపాటు తీసుకుంటూ ఉంటే నిద్రలేమి గుండె దడ, నరాల సమస్యలు తొలగిపోతాయి.

అలాగే మైగ్రేన్ తలనొప్పి ఆస్తమా కూడా తగ్గుతాయి. నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రనాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాలలో రాళ్లను నివారిస్తుంది. సిట్రిక్ యాసిడ్ అనేది శరీరం పాస్పరస్ వంటి ఖనిజాలను శోషించటానికి సహాయపడుతుంది. నిమ్మ ఆకుల లో కూడా విటమిన్ సి ఉంటుంది.

ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే ఈ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. నిమ్మ ఆకులో ఉండే ఒక సహజసిద్ధమైన సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
Diabetes diet in telugu
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇటువంటి ఆకులను వాడటానికి ముందు ఒక్కసారి ఆయుర్వేద వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.