దీపం ఉండగానే అన్నీ చక్కపెట్టేస్తున్న స్టార్స్…ఏమిటో చూడండి
Tollywood celebs and their business : గతంలో కానీ ,ఇప్పుడు కానీ చూస్తే అప్పట్లో కొంతమంది స్టార్స్ మాత్రమే వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాణించారు. కానీ ఇప్పుడు హీరో, హీరోయిన్స్, నటులు కూడా తమ సంపాదనను వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాణిస్తున్నారు. పైగా ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కనుక ముందుగానే జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు.
మిల్కీ బ్యూటీ తమన్నాకు వైట్ అండ్ గోల్డ్ పేరిట జ్యుయలరీ బ్రాండ్ ఉంది. ఆన్ లైన్ లోనే డబ్బులు సంపాదిస్తోంది. దగ్గుబాటి రామానాయుడు మనవడు రానా సినిమాల్లో హీరోగా,విలన్ గా చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీతో పాటు క్వాన్ టాలెంట్ అనే మేనేజ్ మెంట్ ఏజన్సీ నిర్వహిస్తున్నాడు. సెలబ్రిటీ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా.
అలాగే మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తన మిత్రులతో కల్సి స్కిన్ బ్రాండ్ రంగంలో అడుగుపెట్టి, బాగానే రాణిస్తోంది. హీరో సందీప్ కిషన్ హైదరాబాద్, సికింద్రాబాద్ లలో వివాహభోజనంబు పేరిట రెస్టారెంట్స్ నడుపుతున్నాడు. తమిళ స్టార్ విజయ్ కూడా తన తల్లిపేరిట తమిళనాట ఫంక్షన్ హాల్స్ రన్ చేస్తున్నాడు.