ముత్యమంత ముద్దు సీరియల్ నటీనటులు..అసలు పేర్లు ఏమిటో చూడండి
Muthyamantha Muddu serial actors real names :జి తెలుగులో ప్రసారమవుతున్న ముత్యమంత ముద్దు సీరియల్ బుల్లితెర ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉప్పెన మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి లాంచ్ చేసిన ఈ సీరియల్ లో ఋణం పేరుతొ దారుణాలు చేసే అత్త, కన్నవాళ్ళ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేమన్న కోడలి కాన్సెప్ట్ తో నడుస్తోంది. సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ ఆమని ఇందులో విలన్ పాత్ర పోషిస్తోంది. సినిమాల్లో చేసి ఓ వెలుగు వెలిగిన ఆమని బుల్లితెరపై తొలిసారి నెగెటివ్ షేడ్ పాత్ర చేస్తోంది. అమృతం సీరియల్ తో మంచి పాపులార్టీ తెచ్చుకున్న వాసు ఇంటూరి ఆమని భర్త పాత్రలో నటిస్తున్నాడు.
ఇక కన్నవారి ఋణం ఎప్పటికీ తీరనిదని చాటిచెప్పే పాత్రలో కన్నడ నటి నిషా మల్లానా నటిస్తోంది. గడ్డిమేళా అనే కన్నడ సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న నిషా ముత్యమంత ముద్దు సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. హీరోగా సిద్ధార్ధ్ వర్మ నటిస్తున్నాడు. రక్త సంబంధం సీరియల్ తో మంచి పాపులార్టీ తెచ్చుకున్న సిద్ధార్ధ్ పలు సీరియల్స్ లో చేసి, ఇప్పుడు ఇందులో నటిస్తున్నాడు.ముద్దమందారం,సావిత్రిగారబ్బాయి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందిన కృష్ణారెడ్డి హీరో బ్రదర్ గా చేస్తున్నాడు.
హీరోయిన్ సిస్టర్ పాత్రలో ఠాకూర్ నిమాసి నటిస్తోంది. స్టార్ మాలో ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో కూడా ఈమె చేస్తోంది. హీరోయిన్ అమ్మ పాత్రలో మేఘన అమ్మి నటిస్తోంది. చక్రవాకం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ తో మంచి పేరుతెచ్చు కుందీమె. నాగమణి హీరో బామ్మ పాత్ర చేస్తోంది. ఆడపిల్ల,చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో నటించిన రామ్మోహన్ ఇందులో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడు.ఎన్నో మూవీస్, సీరియల్స్ లో చేసిన సీనియర్ నటి డబ్బింగ్ జానకి ఇందులో హీరోయిన్ బామ్మగా చేస్తున్నారు.