లవ్ స్టోరీ విడుదల ఆలస్యం కావటానికి అసలు కారణం ఇదే….!
Love Story Movie :హ్యాపీడేస్,ఆనంద్,లీడర్,ఫిదా ఇలా డిఫరెంట్ మూవీస్ తో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజాగా తెరకెక్కిస్తున్న మూవీ లవ్ స్టోరీ. అక్కినేని నాగచైతన్య,సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ కి నోచుకోవడం లేదు.
ఇందుకు కారణం కరోనా ఎఫెక్ట్. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ ఈ ఏడాది మొదట్లో రిలీజ్ చేయాలనుకుంటే, కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో థియేటర్లు మూతపడిన కారణంగా కుదరలేదు. కొన్ని మూవీస్ ఒత్తిడిలో రిలీజయ్యాయి. చివరకు విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప మూవీ కూడా ఓటిటి బాట పట్టింది. అయితే లవ్ స్టోరీ గురించి ఆదిశగా యోచన చేయలేదు.
పోనీ ఇప్పుడు అన్నీ సర్దుకుంటున్న సమయంలో వినాయక చవితికి రిలీజ్ అవుతుందని భావించారు. కానీ థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచు కోకపోవడం, ఏపీలో టికెట్ల ధరల వ్యవహారంపై నడుస్తున్న తెగక పోవడం కారణంగా మరికొన్నాళ్లు వెయిట్ చేసి రిలీజ్ చేయాలన్న యోచన చేస్తున్నట్లు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. బహుశా సెప్టెంబర్ చివరివారం గానీ, అక్టోబర్ నాటికి గానీ రిలీజ్ కాగలదని టాక్.