ఈ భామకు అవకాశాలు రావటం లేదట…కారణం ఏమిటో…?
Tollywood heroine ananya nagalla : ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు ఛాన్స్ లు వస్తాయో ,ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో చెప్పలేం. కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారు. ఉప్పెన లాంటి మూవీస్ తో కృతిశెట్టి లాంటి వాళ్ళు స్టార్ డమ్ తెచ్చుకుని, వరుస ఆఫర్స్ కొట్టేస్తారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా ఛాన్స్ లు రావు.
ఇలా ప్రయత్నాలు చేస్తున్నా అదృష్టం తలుపు తట్టనివాళ్లలో మల్లేశం హీరోయిన్ అనన్య నాగళ్ళ ఒకరు. ఈమె నటన పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నా పెద్దగా గుర్తింపు రావడం లేదు. సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు పద్దతిగా ఫొటోస్,వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నప్పటికీ ఆమెకు ఛాన్స్ రావడం లేదు.
ఈ మధ్య రిలీజైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ లో అనన్య నాగళ్ళ కు ఛాన్స్ దక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఈమెకు మాత్రం పేరు రాలేదు. ఛాన్స్ లు రావడం లేదు. మరి ఎప్పుడు ఈమెను అదృష్టం తలుపు తడుతుందో చూడాలి.