వినాయక చవితి రోజు పూజకు వాడిన పత్రిని ఇలా చేస్తే కుభేరులు అవ్వటం ఖాయం
Vinayaka Chaviti Patri in telugu :వినాయక చవితి రోజు మనం వినాయకుణ్ణి భక్తి శ్రద్దలతో పూజిస్తూ జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని ప్రార్థిస్తాం. అయితే వినాయకచవితి రోజు మనం తెలియక కొన్ని తెలిసి కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం. వినాయకచవితి రోజు వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేస్తాం. పూజ పూర్తి అయ్యాక చాలా మంది పూజ చేసిన వినాయకుణ్ణి దగ్గరలో ఉన్న గుడిలో కానీ వినాయక ఉత్సవాలు జరిగే చోట సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం పత్రి గురించి ఒక విషయాన్నీ తెలుసుకోవాలి. పూర్వకాలంలో ప్రజలు నీటి కోసం చెరువులు,నదులు, కాలువలు, బావులపై ఎక్కువగా ఆధారపడేవారు. దాంతో అవి ఎక్కువగా కలుషితం అయ్యేవి.
కలుషితం అయినా నీటిని వాడటం ప్రజలు అనారోగ్యాల బారిన పడేవారు. అందువల్ల మన పెద్దలు వినాయకుని నిమ్మజ్జనంతో పాటు వినాయక పూజలో వాడే 21 రకాల పత్రిని కూడా నీటిలో కలపాలనే సంప్రదాయాన్ని అలవాటు చేసారు. ఆలా 21 రకాల పత్రిని కాలువలలో కలపటం వలన కాలువల్లో ఉన్న కలుషితాన్ని పత్రీలో ఉండే ఔషధ లక్షణాలు తొలగిస్తాయి.
కాబట్టి ప్రతి ఒక్కరు వినాయకపూజ అయినా తర్వాత శ్రమ అనుకోకుండా దగ్గరలో ఉన్న కాలువ లేదా నదిలో కలపండి. ఇలా నదిలో కలపటం వలన పుణ్యంతో పాటు పూజ చేసిన ఫలితం కూడా దక్కుతుంది.